News March 3, 2025
గుంటూరు: పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి ఆదివారం చెప్పారు. గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 700 మంది స్టాఫ్ కౌంటింగ్లో పాల్గొంటారని, వారికి ట్రైనింగ్ పూర్తయిందన్నారు. రెండు నుంచి మూడు రోజుల పాటు కౌంటింగ్ జరుగుతుందన్నారు.
Similar News
News December 9, 2025
BSWD: “మా కుటుంబ ఓట్లు అమ్మబడవు”

బాన్సువాడ నియోజకవర్గం, మోస్రా మండలం గోవూర్లో ఎన్నికల నేపథ్యంలో నవీన్ రెడ్డి వినూత్న రీతిలో ప్లెక్సీ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులను ఉద్దేశించి, “మా కుటుంబ ఓట్లు అమ్మబడవు” అని ఇంటి వద్ద ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ఓటుకు నోటు తీసుకోకుండా, స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.
News December 9, 2025
PHC స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు

AP: స్క్రబ్ టైఫస్ జ్వరాల నిర్ధారణ పరీక్షల నమూనాలను PHC స్థాయిలోనే సేకరిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,566 స్క్రబ్ టైఫస్ జ్వరాల కేసులు నమోదైనట్లు చెప్పారు. 9 మరణాలూ అనుమానిత కేసులు మాత్రమే అని, లోతైన పరీక్షలకు జీనోమ్ సీక్వెన్స్ చేయిస్తున్నామన్నారు. కుట్టినట్లు అనిపించిన శరీర భాగంపై నల్లటి మచ్చ కనిపిస్తే అప్రమత్తం కావాలని సూచించారు.
News December 9, 2025
‘పరీక్షా పే చర్చ’.. ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం

‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు పశ్చిమ, ఏలూరు జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. పశ్చిమ గోదావరికి ఎం.విజయప్రసన్న, బి.జాన్సన్లు, ఏలూరు జిల్లాకు వై.స్వరాజ్యశ్రీనివాస్, సీహెచ్ గోవిందరాజులు, శామ్యూల్ సంజీవ్లు ఎంపికయ్యారు. ఈనెల 11వ తేదీ వరకు జరిగే రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించాలని ఆమె సూచించారు.


