News March 3, 2025

గుంటూరు: పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి

image

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి ఆదివారం చెప్పారు. గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 700 మంది స్టాఫ్ కౌంటింగ్‌లో పాల్గొంటారని, వారికి ట్రైనింగ్ పూర్తయిందన్నారు. రెండు నుంచి మూడు రోజుల పాటు కౌంటింగ్ జరుగుతుందన్నారు.

Similar News

News March 20, 2025

ఖమ్మంలో ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

image

ఖమ్మం జిల్లాలో బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ముగిశాయి. ఇవాళ జరిగిన పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డిస్టిక్ ఎగ్జామినేషన్ కమిటీ కన్వీనర్ తెలిపారు. అటు జిల్లా వ్యాప్తంగా జనరల్ కోర్సుల్లో 16,446 మందికి గాను 15,939, అలాగే ఒకేషనల్ కోర్సుల్లో 1,719 మందికి గాను 1,576 మంది హాజరయినట్లు చెప్పారు. రెండు కోర్సులకు సంబంధించి 650 మంది గైర్హాజరు హాజరైనట్లు పేర్కొన్నారు.

News March 20, 2025

దొంగగా మారిన బ్యాంకు ఉద్యోగి

image

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో బ్యాంకు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. అతని నుంచి 2 గన్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాజులూరులో దొంగతనం కేసులో అతనిని అరెస్టు చేయగా పలు విషయాలు బయటపడ్డాయి. నాగేశ్వరరావు గతంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌లో పనిచేస్తూ 900 గ్రాముల బంగారం అవకతవకలు చేయడంతో తొలగించినట్లు తెలిపారు.

News March 20, 2025

బల్లికురవ: వర్క్ ప్రెజర్ వల్లే ఆత్మహత్య?

image

బల్లికురవ(M) గుడిపాడుకు చెందిన బండ్ల హనుమంతరావు(29) నరసరావుపేటలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆత్మహత్యకు పని ఒత్తిడే కారణమని సమాచారం. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఆయన.. వర్క్ ప్రెజర్ వల్ల జాబ్ చేయలేకపోతున్న అంటూ సూసైడ్ నోట్‌లో రాసినట్లు తెలుస్తోంది. ఉద్యోగం వదిలేస్తే భార్య తరఫు బంధువులు మాటలు అంటారేమో అని, అమ్మ, నాన్న క్షమించండి అని సూసైడ్ నోట్‌లో రాసినట్లు సమాచారం.

error: Content is protected !!