News March 3, 2025
గుంటూరు: పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించిన డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కె.గంగాధర్ అధికారికంగా సోమవారం ప్రకటించారు. మొత్తం 10,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 6,942 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్ సైట్ www.anu.ac.inలో చూడవచ్చు.
Similar News
News March 4, 2025
గుంటూరు: తొలి రౌండ్ నుంచే ఆధిక్యం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మొదటి రౌండ్ నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన ఆధిక్యతను చాటుకున్నారు. అందరూ ఆలపాటికి, లక్ష్మణరావుకు మధ్య ఓట్ల వ్యత్యాసం పోటాపోటీగా ఉంటుందని భావించారు. అయితే వీటిని పటాపంచలు చేస్తూ ఆలపాటి ప్రతి రౌండ్‌లోనూ మెజారిటీ పెంచుకుంటూ వెళ్లారు. మొదటి రౌండ్‌లో 17,194 ఓట్లతో మొదలై.. చివరి 9వ రౌండ్ ముగిసేసరికి 1,45,057 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని పొందారు.
News March 4, 2025
GNT: అప్పుడు వెనక్కి తగ్గారు.. ఇప్పుడు విజయం సాధించారు

గత అసెంబ్లీ ఎన్నికలలో తెనాలి నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేయాలని భావించారు. అయితే జనసేన పార్టీకి టికెట్ కేటాయించడంతో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆలపాటి వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలిచి తీరాలని కసితో ఆలపాటి MLC ఎన్నికలను సవాల్‌గా తీసుకొని పట్టభద్రుల మద్దతుతో అఖండ విజయం సాధించారు.
News March 4, 2025
GNT: పాము కాటుకు యువకుడు బలి

కూలి పనికి వెళ్లిన యువకుడు పాముకాటుతో మృతి చెందాడు. మండలంలోని శృంగవరప్పాడు గ్రామానికి చెందిన జయమంగళ జాన్ పదో తరగతి పూర్తి చేశాడు. గుంటూరు(D) అమరావతిలో చేపల పట్టుబడికి ఆదివారం సాయంత్రం 11 మంది గ్రామస్థులతోపాటు మత్స్యకార కూలీగా అతనూ వెళ్లాడు. వీరంతా అర్ధరాత్రి సమయంలో అక్కడకు చేరుకోవడంతో పాకలో నిద్రపోయారు. నిద్రలో ఉన్న జాన్‌ను విషసర్పం కాటు వేసింది. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.