News April 19, 2024
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి షాక్

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా వారిని సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించి, వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Similar News
News September 16, 2025
అమరావతిలో ఆధునిక మురుగునీటి వ్యవస్థ

అమరావతిలో 934 కి.మీ పైపుల ద్వారా మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మిస్తోంది. 13 STPలు రోజుకు మొత్తం 330.57 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయని CRDA పేర్కొంది. ఇవి ఫ్లషింగ్, శీతలీకరణ & నీటిపారుదల కోసం నీటిని తిరిగి ఉపయోగించుకునేలా చేస్తాయి! నగరాన్ని పచ్చగా, స్థిరంగా మార్చడానికి ఒక సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను కూడా ప్లాన్ చేస్తున్నారు.
News September 16, 2025
ANU: ఏపీ ఎడ్ సెట్-2025 షెడ్యూల్లో స్వల్ప మార్పు

ఏపీ ఎడ్సెట్-2025 కౌన్సెలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ స్వామి తెలిపారు. వెబ్ ఆప్షన్స్ గడువు ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించామన్నారు. కళాశాల మార్పునకు 18వ తేదీ చివరి గడువు అని పేర్కొన్నారు. అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రక్రియ 20వ తేదీన జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులు ఈ మార్పులను గమనించాలని సూచించారు.
News September 15, 2025
ANU: ఏపీ పీజీ సెట్ షెడ్యూల్ మార్పు

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీ పీజీ సెట్ – 2025 షెడ్యూల్లో మార్పులు జరిగాయని కన్వీనర్ ప్రొఫెసర్ రవికుమార్ తెలిపారు. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 17 వరకు, ఆన్లైన్ సర్టిఫికెట్ ధ్రువీకరణను 18 వరకు పొడిగించినట్లు ఆయన చెప్పారు. వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఈ నెల 20 వరకు జరుగుతుందని పేర్కొన్నారు.