News July 29, 2024

గుంటూరు: పింఛన్‌ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

image

ఆగస్ట్ 1వ తేదీనే పింఛన్లు నూరు శాతం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో మొత్తం 2,60,192 మందికి రూ.110.69కోట్లు పంచాల్సి ఉంది. జిల్లాలో గత నెలలో పింఛన్ పంపిణీలో 4664 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఆగస్ట్ నెలలో ఒక్కో ఉద్యోగికి 50-100 మంది ఉండేలా మ్యాపింగ్ చేస్తున్నారు.

Similar News

News November 18, 2024

గుంటూరు: దివ్యాంగుల నుంచి వినతిపత్రం స్వీకరించిన కలెక్టర్

image

కలెక్టరేట్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన దివ్యాంగుల వద్దకే కలెక్టర్ వెళ్లి వినతిని స్వీకరించారు. తమ సమస్యలను అధికారులకు వివరించిన పట్టించుకోవడంలేదని విభిన్న ప్రతిభావంతులు కలెక్టర్‌ను వేడుకున్నారు. దివ్యాంగులకు కావాల్సిన వీల్ ఛైర్‌లు, బ్యాటరీ వాహనాలను, చెక్క కర్రలు, వినికిడి యంత్రాలను అందించాలని దివ్యాంగులు కోరారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. 

News November 18, 2024

బాలుడిని కొట్టి చంపిన తోటి విద్యార్థులు

image

ఓ విద్యార్థిని సహచర విద్యార్థులు కొట్టి చంపి బావిలో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికుల వివరాల మేరకు.. పొన్నెకల్లులో సమీర్ అనే 9వ తరగతి విద్యార్థిని తోటి విద్యార్థులు గత నెల 24న గొడవపడి కొట్టి చంపి బావిలో పడేశారు. స్థానికులు గమనించి ఉపాధ్యాయులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా కుటుంబసభ్యులకు అప్పగించగా, బాలుడి ఒంటిపై రక్తపు గాయాలు ఉండడాన్ని గమనించడంతో వెలుగులోకి వచ్చింది.

News November 18, 2024

‘శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు’

image

శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని చిలకలూరిపేట MLA ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఆదివారం చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబం విషాదంలో ఉంటే తమ్ముడిని తొక్కేశాడని, కుటుంబంలో వివాదం ఉందని జగన్ మీడియా వార్తలు రాయటం దారుణమన్నారు. సొంత మనుషులను రాజకీయంగా వాడుకొని ఎలా వదిలేయాలో జగన్‌కు తెలిసినట్లు ఎవరికీ తెలియదు అన్నారు. ముందు తల్లి, చెల్లికి సమాధానం చెప్పాలన్నారు.