News July 11, 2024
గుంటూరు: పిన్నెల్లి బెయిల్ పిటిషన్లు.. వాదనలు ఇలా.!

మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లపై బుధవారం గుంటూరు జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. రిగ్గింగ్‌ను ఆపడానికి పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టినట్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇటీవల ఒప్పుకున్నారని చెప్పారు. పిన్నెల్లి తరఫు న్యాయవాది వాదిస్తూ, కక్షపూరితంగా కేసులు పెట్టారన్నారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును 18కి వాయిదా వేసింది.
Similar News
News October 16, 2025
భాగస్వామ్య సదస్సుపై జిల్లాలో అవగాహన: కలెక్టర్

విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు (ఇండస్ట్రీ పార్ట్‌నర్‌షిప్ డ్రైవ్) పోస్టర్‌ను కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి నవంబర్ 15 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సదస్సులో జిల్లా నుంచి ఎక్కువ మంది భాగస్వామ్యం అయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.
News October 15, 2025
మంగళగిరి: పోలీస్ అమరవీరుల దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన

దేశవ్యాప్తంగా అక్టోబర్ 21న నిర్వహించబోతున్న పోలీసు అమరవీరుల దినోత్సవ ఏర్పాట్లను మంగళగిరి ఏపీఎస్‌పీ 6 బెటాలియన్‌లో ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం పరిశీలించారు. భద్రత, అమరవీరుల స్తూపం, స్టేజి నిర్మాణం, పరేడ్ స్థలాలను బెటాలియన్ ఇన్‌ఛార్జ్ కమాండెంట్ ఏ.మురళీ ఎస్పీకి వివరించారు. సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నారు.
News October 15, 2025
తెనాలిలో పెరుగుతున్న క్రైమ్ రేటు!(1/2)

ప్రశాంతంగా ఉంటున్న తెనాలిలో పరిస్థితి 3 మర్డర్లు..6 చోరీలు అన్నట్లుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. గత 7 నెలల కాలంలో వేర్వేరు కారణాలతో ఏడుగురు హతమయ్యారు. చెంచుపేటలో ఇవాళ జరిగిన హత్య లాగానే కొన్ని నెలల క్రితం పండ్ల వ్యాపారిని దారుణంగా కత్తితో నరికి హత్య చేశారు. తర్వాత ముత్తింశెట్టిపాలెంలో మహిళ హత్య, పరిమి రోడ్డులో డబుల్ మర్డర్, పినపాడులో ఒకటి, వార్ఫ్ రోడ్డులో ఇంకో హత్య జరిగాయి.