News March 24, 2024

గుంటూరు: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

image

ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో గ్రామానికి చెందిన దొప్పలపూడి రాజేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. దొప్పలపూడి రాజేష్‌ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తన మృతికి ఐదుగురు వ్యక్తులు కారణమంటూ సూసైడ్ నోటు రాసి మరణించాడు.

Similar News

News October 25, 2025

GNT: ఇది ప్రకృతి పట్ల కృతజ్ఞత తెలిపే పండుగ

image

నాగులచవితి హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైన పర్వదినం. ఈరోజు నాగదేవతలను పూజించడం ద్వారా సర్పదోషాలు తొలగి కుటుంబంలో ఆరోగ్యం, సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం ఉంది. ఆడవారు ఉపవాసం ఉండి పాలు, పండ్లు, పువ్వులతో నాగదేవతను ఆరాధిస్తారు. రైతులు పంటల రక్షణ కోసం, గృహిణులు కుటుంబ సౌఖ్యం కోసం ప్రార్థనలు చేస్తారు. ఇది ప్రకృతి, జీవజాలాల పట్ల కృతజ్ఞత తెలిపే పండుగగా భావిస్తారు.

News October 25, 2025

అవాస్తవ, ద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ

image

సామాజిక మాధ్యమాల ద్వారా అవాస్తవ ప్రచారాలు, ద్వేషపూరిత పోస్టులు, వీడియోలు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. జిల్లా పోలీస్ అధికారులతో శుక్రవారం జూమ్ ద్వారా ఎస్పీ సమీక్ష నిర్వహించారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, విదేశాల్లో ఉన్న నిందితులపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని సూచించారు. ప్రజలు అనుమానాస్పద పోస్టులు గమనిస్తే వెంటనే పోలీసులకు తెలపాలన్నారు.

News October 24, 2025

పత్తి సేకరణలో సందేహాలు నివృత్తి చేయాలి: కలెక్టర్

image

పత్తి రైతుల రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వ్యవసాయ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. పత్తి, ధాన్యం కొనుగోలు పై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రైతు సేవా కేంద్రం వారిగా రైతులతో సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. ప్రాంతాల వారీగా పత్తి ఉత్పాదకత వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పత్తి సేకరణలో తరచూ తలెత్తే సందేహాలను స్పష్టంగా నివృత్తి చేయాలన్నారు.