News March 8, 2025
గుంటూరు: పురుషులకంటే తానేమి తక్కువకాదంటుంది

పురుషులకంటే తానేమి తక్కువకాదంటూ నిరూపిస్తుంది ఉమ్మడి జిల్లాకి చెందిన ఫొటోగ్రాఫర్ హైమావతి. శ్రీనగర్ కాలనీకి చెందిన ఆమె 16 ఏళ్లుగా వృత్తిలో ఉన్నారు. భర్త చిరుద్యోగి కావడంతో ఆర్థిక పరిస్థితుల వల్ల ఆమె ఈ రంగాన్ని ఎంచుకున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా వెనుకంజ వేయకుండా వేరే ప్రాంతాలకు వెళ్లి మరి సత్తాను చాటుకుంటున్నారు. 2012లో బాపట్లలో నిర్వహించిన పోటీల్లో హైమావతి 2వ బహుమతి సాధించారు.
Similar News
News November 23, 2025
గుంటూరులో నాన్ వెజ్ ధరలు ఇవే.!

గుంటూరులో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ.200, విత్ స్కిన్ రూ.180గా విక్రయిస్తున్నారు. మటన్ కేజీ ధర రూ.1050 పలుకుతోంది. ఇక చేపలు బొచ్చెలు, రాగండి ఇలా రకాలను బట్టి కేజీ రూ.200 నుంచి రూ.280 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 23, 2025
గుంటూరు: CCI పత్తి కొనుగోళ్లు ప్రారంభం

2025–26 సీజన్‌కు పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్టు CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా శనివారం తెలిపారు. రాష్ట్రంలో 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. MSP కింద పత్తి అమ్మడానికి Kapas Kisan App ద్వారా స్లాట్‌బుక్ చేసుకోవాలని రైతులకు సూచించారు. తేమ 8% లోపు ఉంటే పూర్తి MSP, 8–12% మధ్య ఉంటే తగ్గింపులు ఉంటాయని తెలిపారు. సహాయం కోసం WhatsApp హెల్ప్‌లైన్ 7659954529 అందుబాటులో ఉందన్నారు.
News November 23, 2025
GNT: ఐటీసీ వద్ద కాల్వలో మృతదేహం కలకలం

నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీసీ వద్ద కాల్వలో మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. విధుల్లో ఉన్న రక్షక్ సిబ్బంది ఐటీసీ ప్రహరీగోడకు ఆనుకొని ఉన్న కాల్వలో మృతదేహాన్ని గుర్తించి స్థానికంగా ఆరా తీశారు. వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. గుర్తుతెలియని మృతదేహానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


