News May 25, 2024
గుంటూరు: పొలాల్లో యువతి మృతదేహం కలకలం

గుంటూరు సమీపంలోని పొలాల్లో ఒక యువతి దేహం పడి ఉండటం స్థానికంగా కలకలం రేపుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు సమీపంలోని పెదకాకాని వద్ద పొలాల్లో గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె నోటి వెంట నురగతో పాటు రక్తం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 16, 2025
మంగళగిరి: 5 కిలోల బంగారు ఆభరణాల చోరీ

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద 5 కిలోల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. వాటి విలువ ఐదు కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. బంగారు ఆభరణాలు సంచితో జ్యువెలరీలోని గుమస్తా దీవి నాగరాజు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు.అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు సంచిని గుర్తుతెలియని యువకులు లాక్కుని పారిపోయారు. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 16, 2025
అధికారులకు GNT జేసీ ఆదేశాలు

గ్రూప్2 మెయిన్స్ పరీక్ష కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఆదేశించారు. మెయిన్స్ పరీక్ష ఈనెల 23వ తేదీన జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం జిల్లాలో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షకు 9,277 అభ్యర్ధులు హాజరవుతారని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.
News February 15, 2025
గుంటూరు GGHలో విద్యార్థినులకు లైంగిక వేధింపులు

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. ల్యాబ్ టెక్నీషియన్లుగా శిక్షణ పొందుతున్న విద్యార్థినులపై బ్లడ్ బ్యాంకు ఉద్యోగి ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణ ఆసుపత్రిలో కలకలం రేపింది. ఈ మేరకు బాధిత విద్యార్థినులు వారి ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో లైంగిక వేధింపుల ఘటన పై విచారణ చేపట్టాలని ముగ్గురు అధికారులతో ఒక కమిటీని ప్రిన్సిపాల్ ఏర్పాటు చేశారు.