News March 29, 2024
గుంటూరు: పోలింగ్ ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభం

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. పోలింగ్‌లో పాల్గొనే ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల విభజనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 1,884 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని కేంద్రాల్లో 1,300 కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 31 వరకు ఉన్నట్టు జిల్లా అధికారులు గుర్తించారు.
Similar News
News February 11, 2026
గుంటూరు: మహాశివరాత్రికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

మహాశివరాత్రి (ఫిబ్రవరి 15) సందర్భంగా జిల్లాలోని ప్రధాన శివాలయాలు, తిరునాళ్లు, నదీ తీర ప్రాంతాల్లో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా, ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి భక్తుల భద్రతకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అనుమానాస్పద విషయాలు గమనిస్తే 112/100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
News February 11, 2026
పనివేళల్లోనే సర్వేలు చేయించాలి: కలెక్టర్

సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా, కేవలం పనివేళల్లోనే సర్వేలు నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి MPDOలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ‘అక్షర ఆంధ్ర’, ‘యూనిఫైడ్ ఫ్యామిలీ’ సర్వేల పురోగతిని సమీక్షించారు. సిబ్బంది సేవలను సమతుల్యంగా వినియోగించుకోవాలని, సర్వేల నిర్వహణను పర్యవేక్షణ అధికారులు నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు.
News February 11, 2026
GNT: శివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని శివాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. దేవదాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత ఏడాది కంటే మెరుగ్గా ఏర్పాట్లు ఉండాలని, భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


