News June 29, 2024
గుంటూరు: పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన ఎస్పీ
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ తుషార్ డూడి పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది తమ అనారోగ్య సమస్యలను వ్యక్తిగత సమస్యలను ఎస్పీకి వివరించగా సిబ్బంది సమస్యలను పరిగణలోకి తీసుకొని, వారికి సాధ్యమైనంత మేర సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Similar News
News December 1, 2024
ధాన్యం కొనుగోలుపై అపోహలు వద్దు: నాదెండ్ల
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు వరకు ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి పట్టణ పరిధిలోని ఐతానగర్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వానికి ధాన్యం విక్రయించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు మీద ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని భరోసా కల్పించారు.
News December 1, 2024
రేపు మంగళగిరిలో ప్రజా వేదిక నిర్వహణ
మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో సోమవారం ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కార్యాలయ నిర్వాహకులు ఆదివారం తెలిపారు. రేపు జరిగే ప్రజా వేదికలో గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, APTDC ఛైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ కేకే చౌదరి పాల్గొంటారని చెప్పారు. ఈ ప్రజా వేదికలో వారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారన్నారు. అందరూ ఈ ప్రజా వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 1, 2024
పీఠాధిపతిగా చిన్న వయసు నుంచే మన్ననలు పొందారు
పల్నాటి ఉత్సవాలలో భాగంగా ప్రస్తుతం వీరాచారాన్ని చేస్తున్నది పిడుగు వంశీకులలోని పిడుగు తరుణ్ చెన్నకేశవ అయ్యవారు. ఆయన తండ్రి విజయ్, తల్లి సరస్వతి. చిరుప్రాయంలోనే పల్నాటి వీరాచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక పక్క చదువుతూ తండ్రి బొగ్గరం విజయ్ నేతృత్వంలో ఆచారాన్ని కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందారు. గ్రామంలో నేటికి అలనాటి చారిత్రక చిహ్నాలు ఉన్నప్పటికి ఆదరించే అధికారులు కానరాక శిథిలావస్థకు చేరాయి.