News March 3, 2025

గుంటూరు: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు గుంటూరు మీదుగా చర్లపల్లి(CHZ), కాకినాడ టౌన్(CCT) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈనెల 7,14, 21, 28న CHZ-CCT(నం.07031), ఈ నెల 2,9,16, 23న CCT- CHZ(నం.07032) రైళ్లు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలోని గుంటూరుతో పాటు సత్తెనపల్లి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం,రాజమండ్రి, సామర్లకోటలో ఆగుతాయని వారు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. 

Similar News

News March 21, 2025

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ 

image

మంగళగిరి క్యాంపు కార్యాలయంలో 26 జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, MGNREGS ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై, పల్లె పండుగలో భాగంగా మొదలుపెట్టిన అభివృద్ధి పనుల స్థితిగతులపై, రేపు మొదలు పెట్టబోయే ఫాం పాండ్స్ పనులపై ఆరా తీశారు. ఈ కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ పాల్గొన్నారు. 

News March 21, 2025

మంగళగిరి: సీసీటీవీల పురోగతిపై హోంమంత్రి సమీక్ష 

image

మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ హరీశ్ గుప్తాతో పాటు జిల్లాల ఎస్సీలతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో పురోగతి, మహిళలపై జరుగుతున్న నేరాలు, పోలీసింగ్‌లో టెక్నాలజీ వినియోగం తదితర ప్రధాన అంశాలపై చర్చించారు. రెవెన్యూ పరమైన కేసుల్లో ఆ శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పరిష్కరించేందుకు తగిన ఆదేశాలు ఇచ్చారు. 

News March 21, 2025

గుంటూరు మేయర్‌గా కోవెలమూడి?

image

గుంటూరు మేయర్ పదవికి కావటి మనోహర్ రాజీనామా చేయడంతో నెక్స్ట్ మేయర్ ఎవరనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆశావహుల పేర్లలో కోవెలమూడి రవీంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పలువురు సీనియర్ కార్పొరేటర్లు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అధిష్ఠానం మేయర్ అభ్యర్థిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పెమ్మసాని గుంటూరు వచ్చిన వెంటనే కౌన్సిల్ మీటింగ్ పెట్టి మేయర్‌ని ఎన్నుకునే అవకాశముంది.

error: Content is protected !!