News January 2, 2025
గుంటూరు: ప్రియురాలి కోసం వశీకరణ.. హత్య
పెదకాకాని(M) నంబూరికి చెందిన మల్లిక హత్య కేసులో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మల్లిక ఓ వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. రెహమాన్‌తో వివాహేతర సంబంధం, మరొకరితో సహజీవనం చేసేది. దీంతో మల్లికను దక్కించుకోవాలనే ఉద్దేశంతో రెహమాన్ వశీకరణ చేయాలనుకున్నాడు. ఈ మేరకు డిల్లీకి చెందిన వ్యక్తితో రూ.3 లక్షలకు మాట్లాడుకొని దుస్తులు, జుట్టు, ఇతర వస్తువులు తెచ్చిచేశాడు. ఫలితం లేకపోవడంతో హత్య చేయించాడు.
Similar News
News January 19, 2025
డిప్యూటీ సీఎం కార్యాలయం వద్ద పోలీసుల విచారణ
మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం అలాగే జాతీయ పార్టీ కార్యాలయం వద్ద శనివారం డ్రోన్ కలకలం రేపిన సంగతి విధితమే. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారులు క్యాంపు కార్యాలయం వద్ద విచారణ చేపట్టారు. డ్రోన్ ఎవరు ఎగరవేశారు, ఎటువైపు నుంచి డ్రోన్ వచ్చింది అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. పవన్ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
News January 19, 2025
గుంటూరు: దేహదారుడ్య పరీక్షల్లో 312 మంది ఉత్తీర్ణత
కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షల్లో 312 మంది ఉత్తీర్ణత సాధించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న పరీక్షల్లో శనివారం 529 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పలు దశల్లో కొందరు అనర్హులుగా మిగిలారు. దీంతో మొత్తం 434 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో చివరికి 312 మంది అర్హత పొందారు. అదనపు ఎస్పీలు జీవీ రమణ మూర్తి, ఎ. హనుమంతు పరీక్షలను పరిశీలించారు.
News January 18, 2025
మంగళగిరి: పవన్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ కలకలం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసు అయిన మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం సమయంలో కార్యాలయంపై ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దాదాపు 20నిమిషాలు పాటు డ్రోన్ ఎగిరినట్లు కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. దీంతో ఉలిక్కిపడిన సిబ్బంది వెంటనే డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.