News July 18, 2024
గుంటూరు: బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్

చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో జరిగిన బాలిక శైలజ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లికి నిందితుడు నాగరాజుకు మూడేళ్లుగా పరిచయం ఉన్నట్లు సమాచారం. నిందితుడి ఇంట్లో మృతురాలి తల్లి ఇందిరమ్మ గాజులు దొరకడంతో నాగరాజుకు, ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటన్న కోణంలో పోలీసులు ఇందిరమ్మను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.
Similar News
News September 19, 2025
తాగునీటిలో మురుగునీరు కలవడంతోనే సమస్య: సీపీఎం

గుంటూరులో డయేరియా వ్యాప్తిపై సీపీఎం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీటి కారణంగానే ఈ సమస్య తలెత్తిందని, అధికారులు తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం జీజీహెచ్లో డయేరియా రోగులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటికే 33 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వర్షాలకు మురుగు నీరు తాగునీటి పైపుల్లో కలిసి ప్రజలకు సరఫరా అవుతోందని ఆరోపించారు.
News September 19, 2025
గుంటూరు జిల్లాలో వర్షపాతం వివరాలు

గుంటూరు జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి గురువారం పలు ప్రాంతాల్లో చినుకులు పడ్డాయి. మొత్తం మీద సగటు వర్షపాతం 4.1 మిల్లీమీటర్లుగా నమోదైంది. పెదనందిపాడు మండలం 15.6 మి.మీ.తో అగ్రస్థానంలో ఉండగా, తుళ్లూరులో కేవలం 1.8 మి.మీ. మాత్రమే పడింది. మంగళగిరి 9.8, తాడికొండ 9.6, కాకుమాను 9.4, చేబ్రోలు 9.2, గుంటూరు పశ్చిమ 9.2, తాడేపల్లిలో 8.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈ వర్షాలతో రైతులు కొంత ఊరట పొందారు
News September 19, 2025
సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా గుంటూరు జిల్లాలో అంటు వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో 0863- 2234014 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.