News July 18, 2024

గుంటూరు: బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్

image

చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో జరిగిన బాలిక శైలజ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లికి నిందితుడు నాగరాజుకు మూడేళ్లుగా పరిచయం ఉన్నట్లు సమాచారం. నిందితుడి ఇంట్లో మృతురాలి తల్లి ఇందిరమ్మ గాజులు దొరకడంతో నాగరాజుకు, ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటన్న కోణంలో పోలీసులు ఇందిరమ్మను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

Similar News

News December 9, 2024

రెంటచింతల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

image

రెంటచింతల పోలీస్ స్టేషన్‌ను గురజాల డీఎస్పీ జగదీష్ సోమవారం సందర్శించారు. సాధారణ తనిఖీలలో భాగంగా రెంటచింతల స్టేషన్లోని పెండింగ్ కేసుల వివరాలను, రికార్డు మెయిన్టెనెన్స్ తీరును ఆయన పరిశీలించారు. మండలంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు. డీఎస్పీ వెంట కారంపూడి సీఐ శ్రీనివాసరావు ఎస్సై నాగార్జున ఉన్నారు.

News December 9, 2024

తాడేపల్లిలో మహిళపై అత్యాచారయత్నం 

image

తాడేపల్లిలో ఓ మహిళపై ఆదివారం రాత్రి అత్యాచారయత్నం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తన కుమారుడి స్నేహితుడు రామారావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో సదరు మహిళ భయంతో మాజీ CM జగన్ హెలీప్యాడ్ వైపు పరుగులు తీసింది. స్థానికుల సహాయంతో ఆ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

News December 9, 2024

పల్నాడు: ఆ నలుగురి చివరి ఫొటో ఇదే..!

image

పల్నాడు జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా కావలి పట్టణ వాసులు నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆంజనేయస్వామి మాల వేసుకున్న వీరంతా తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా కారు చెట్టు ఢీకొని చనిపోయారు. కొండగట్టులో వాళ్లు తీసుకున్న చివరి ఫొటో ఇదే. ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లు కన్నుమూయడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు.