News September 26, 2024

గుంటూరు: బీ-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీ ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2,4,6వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 4 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.

Similar News

News November 18, 2025

Way2News కథనానికి నాగార్జున వర్సిటీ స్పందన

image

<<18322201>>మాస్టారూ.. ఇదేం క్వశ్చన్ పేపర్?<<>> అంటూ Way2Newsలో మంగళవారం వచ్చిన వార్తకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల సమన్వయకర్త స్పందించారు. బీఈడి, ఎంఈడీ, ఎల్‌బీబీ, పీజీ సైన్స్, ఆర్ట్స్ పరీక్షలు ఒకే సమయంలో ఉండటం వల్ల పొరపాటున Msc 3rd సెమిస్టర్ ప్రశ్నాపత్రం రాతపూర్వకంగా వచ్చిందని తెలిపారు. ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా చూసుకుంటామని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News November 18, 2025

ANU: థర్డ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం బిఈడి థర్డ్ సెమిస్టర్, పీజీ సైన్స్, ఆర్ట్స్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈడి, ఎల్.ఎల్.బి పరీక్షలు ప్రారంభమయ్యాయి. థర్డ్ సెమిస్టర్ 22 పరీక్షా కేంద్రాల్లోను, ఎల్.ఎల్.బి గుంటూరులో మూడు పరీక్ష కేంద్రాలు, ప్రకాశం జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. వర్సిటీ పరీక్షల సమన్వయకర్త ఆచార్య ఎం.సుబ్బారావు పరీక్షలు తీరును పరిశీలించారు.

News November 18, 2025

మంగళగిరి: భార్యను హత్య చేసిన భర్త

image

మంగళగిరి పరిధి యర్రబాలెంలో వివాహిత హత్యకు గురైంది. CI బ్రహ్మం, SI వెంకట్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. వారి వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన కిలిమి లక్ష్మీ (29) 5 ఏళ్ళ క్రితం శంకర్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. కలహాలతో విడిపోయి, చినకాకానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తూ యర్రబాలెంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త శంకర్ రెడ్డి గొంతునులిమి హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.