News March 7, 2025
గుంటూరు: బోరుగడ్డ అనిల్‌కు ఈ నెల 10 వరకు బెయిల్

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్‌కి రాష్ట్ర హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనిల్ తల్లి ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్‌కి ఈ నెల 10 వరకు బెయిల్ దక్కింది. 11వ తేదీన తిరిగి అనిల్ జైలుకు వస్తారని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజకుమార్ తెలిపారు.
Similar News
News October 27, 2025
గుంటూరు జిల్లాలో నత్తనడకన రేషన్ కార్డుల పంపిణీ

గుంటూరు జిల్లాలో రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 5,99,558 కార్డులు ఉండగా వాటికి తోడు మరో 9 వేలు కొత్త కార్డులు తాజాగా ఆమోదించారు. తొలివిడతగా జిల్లాకు 5,85,615 స్మార్ట్ కార్డులను ప్రభుత్వం ముద్రించింది. ఇప్పటివరకు 5,23,418 కార్డులను మాత్రమే పంపిణీ చేయగా, మరో 80 వేల కార్డులు లబ్ధిదారులకు అందాల్సి ఉంది. స్మార్ట్ రేషన్ కార్డులు డీలర్లు, సచివాలయ సిబ్బంది దగ్గర పేరుకుపోయాయి.
News October 27, 2025
సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి: DEO

తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక సూచించారు. ఎంఈవోలు మండల కేంద్రాల్లో ఉండి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. తుపాను షెల్టర్ల ఏర్పాటు కోసం తహశీల్దార్లు, ఎంపీడీవోలకు సహకరించాలని తెలిపారు. డీఈవో కార్యాలయంలోనూ 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు రేణుక చెప్పారు.
News October 27, 2025
గుంటూరు: తుఫాన్ దృష్ట్యా పీజీఆర్ఎస్ రద్దు

‘మెంథా’ తుఫాన్ దృష్ట్యా సోమవారం గుంటూరు జీఎంసీలో నిర్వహించాల్సిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గుంటూరు నగర ప్రజలు ఈ రద్దు విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.


