News April 13, 2025
గుంటూరు: భక్తిశ్రద్ధలతో చండీహోమం

బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యాన పౌర్ణమి సందర్భంగా శనివారం చండీహోమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మస్తానయ్య మాట్లాడుతూ.. విశ్వ మానవాళి కోసం శాంతిని కాంక్షిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో 9 మంది వేద పండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించడం జరిగిందన్నారు.
Similar News
News April 16, 2025
గుంటూరు: సినిమాలో నటిస్తున్న ఎమ్మెల్యే

పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సినిమాలో నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న ప్రధాన పాత్ర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని దర్శకులు దిలీప్ రాజా చెప్పారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను ప్రకటించారు. సినిమా పూర్తిస్థాయి కమర్షియల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తామన్నారు. దర్శకులు నరేశ్ దోనే, మణివరణ్ ఉన్నారు.
News April 16, 2025
గుంటూరు జిల్లాకు కొత్త ఎస్సీ కార్పొరేషన్ ఈడీ

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో భాగంగా 16 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కే. శ్రీనివాస్‌ను నియమించారు. సామాజిక న్యాయాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ నియామకం కీలకంగా భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న శాఖల్లో కొత్త బాధ్యతలు చేపట్టనున్న డిప్యూటీ కలెక్టర్‌లు సంబంధిత జిల్లాల్లో సేవలు అందించనున్నారు.
News April 16, 2025
గుంటూరులో ఇంటర్ విద్యార్థి అదృశ్యం

గుంటూరులోని బొంగరాలాబీడుకు చెందిన కల్పన(19) ఓ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఎంసెట్ కోచింగ్ నిమిత్తం అమరావతి రోడ్డు కాలేజీ వద్దకి వెళ్లి అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లింది. ఇంత వరకూ తిరిగి ఇంటికి రాలేదని, చుట్టు పక్కల వెతికినా ఆచూకీ దొరకలేదని తల్లి భారతి అరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.