News September 22, 2024

గుంటూరు: భర్త అనుమానంతో వేధిస్తున్నాడు

image

భర్త అనుమానంతో వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. వరగానికి చెందిన వీరయ్యకు గుంటూరుకు చెందిన రాణితో 10ఏళ్ల క్రితం పెళ్లైంది. ఎవరితో మాట్లాడినా అనుమానంతో వేధిస్తున్నాడంటూ, మద్యం తాగి వచ్చి తరచూ.. గొడవపడి తన్నుతున్నాడని, మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

Similar News

News October 15, 2024

గుంటూరు: మహిళలకు ఎన్ని మద్యం షాపులు వచ్చాయంటే?

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలీసుల బందోబస్తు మధ్య మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ముగిసింది. 373 షాపులకు 9,191 దరఖాస్తులు వచ్చాయి. కాగా గుంటూరు జిల్లాలో 4 గంటల్లోనే లాటరీ ప్రక్రియ ముగియడం విశేషం. గుంటూరు జిల్లాలో 127 షాపులకు 11 మహిళలకు దక్కాయి. అటు బాపట్ల జిల్లాలో 117 దుకాణాలకు గాను 7, పల్నాడు జిల్లాలో 129 షాపులకు 7 చోట్ల మహిళలకు దక్కాయి. అత్యధికంగా మంగళగిరిలో 28 షాపులకు 6 మహిళలకే దక్కడం విశేషం.

News October 15, 2024

గుంటూరు: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో టీవీ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోర్స్ కో-ఆర్డినేటర్ మధుబాబు సోమవారం తెలిపారు. రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ విధానంలో ఈ కోర్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సులో ప్రవేశాలు పొందేందుకు ఏదైనా డిగ్రీ కోర్స్ ఉత్తీర్ణత కలిగి ఉండాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

News October 14, 2024

అమరావతి డ్రోన్ సదస్సు నిర్వహణకు ఉత్తర్వులు

image

అక్టోబరు 22, 23వ తేదీల్లో జరగనున్న అమరావతి డ్రోన్ సదస్సు-2024 నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సదస్సు నిర్వహణకు రూ.5.54 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో 2 రోజుల పాటు ఈ జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.