News August 21, 2024

గుంటూరు: భారత్ బంద్.. పరీక్షల తేదీల్లో మార్పులు

image

దళిత సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో బుధవారం జరిగే పరీక్షల తేదీలలో మార్పులు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు 27కి, బీటెక్ మొదటి, 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు, బీటెక్ 2వ ఏడాది ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 3వ తేదీకి మార్పు చేసినట్లు తెలిపారు.

Similar News

News February 23, 2026

గుంటూరు SP PGRSకు 215 ఫిర్యాదులు

image

గుంటూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 215 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కుటుంబ వివాదాలు, ఆస్తి, భూ తగాదాలు, రుణ, ఆర్థిక సమస్యలు, మోసపూరిత కేసులు, వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చాయన్నారు. ఫిర్యాదులను సమగ్రంగా విచారించి చట్టపరంగా గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

News February 23, 2026

గుంటూరు జిల్లాలో ఇంటర్ పరీక్షల సందడి

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరికాసేపట్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 68,898 మంది విద్యార్థులు హాజరవుతుండగా, వారి కోసం అధికారులు 87 పరీక్షా కేంద్రాలను సర్వం సిద్ధం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అధికారులు అన్ని కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

News February 23, 2026

నేడు గుంటూరు కలెక్టరేట్‌లో PGRS: కలెక్టర్

image

గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం PGRS, రెవెన్యూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inసైట్‌లో అర్జీలు సమర్పించవచ్చన్నారు. 1100 టోల్ ఫ్రీ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకొవచ్చని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం 4 రెవెన్యూక్లీనిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.