News August 21, 2024
గుంటూరు: భారత్ బంద్.. పరీక్షల తేదీల్లో మార్పులు
దళిత సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో బుధవారం జరిగే పరీక్షల తేదీలలో మార్పులు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు 27కి, బీటెక్ మొదటి, 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు, బీటెక్ 2వ ఏడాది ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 3వ తేదీకి మార్పు చేసినట్లు తెలిపారు.
Similar News
News September 8, 2024
గుంటూరు: ప్రజా సమస్యల పరిష్కార రద్దు
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు పరిచినట్లు గుంటూరు కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి IAS ఆదివారం తెలిపారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.
News September 8, 2024
పాముకాటుతో విద్యార్థి మృతి బాధాకరం: నారా లోకేశ్
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో MA బుద్ధిస్ట్ స్టడీస్ చదువుతున్న మయన్మార్ విద్యార్థి కొండన్న పాముకాటుకు గురై మృతి చెందడంపై మంత్రి <<14050417>>నారా లోకేశ్ సంతాపం తెలిపారు.<<>> ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యూనివర్సిటీ అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని, కొండన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
News September 8, 2024
ANUలో పాముకాటుతో బుద్ధిజం విద్యార్థి మృతి
గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో రక్త పింజర పాముకాటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మయన్మార్‌కు చెంది కొండన్న ANUలో MA బుద్ధిజం చదువుతున్నాడు. శనివారం క్యాంపస్ ఆవరణలో పుట్టగొడుగులు ఏరుతుండగా పాముకాటుకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, సిబ్బంది అతణ్ని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.