News April 10, 2024

గుంటూరు: భార్య గొంతు కోసి పరారైన భర్త

image

పెదకాకానిలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక వెంగళరావు నగర్‌లో నివాసముంటున్న సయ్యద్‌ షామీర్‌ మూడేళ్ళ క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సయ్యద్‌ తన భార్య గొంతు కోసి పరారయ్యాడు. ఇది గమనించిన స్థానికులు ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News March 27, 2025

ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా 

image

మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 2వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కాగా ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌కు మాజీ మంత్రి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

News March 27, 2025

గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం వాయిదా

image

ఈనెల 29వ తేదీన గుంటూరులో జరగనున్న ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా బుధవారం తెలిపారు. 2025-26వ సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వ పథకాలను అదనంగా చేర్చ వలసి ఉన్నందున అదే విధంగా మెజార్టీ సభ్యులు కొంత సమయం కోరిన కారణంగా వాయిదా వేసినట్లు ఛైర్‌పర్సన్ తెలిపారు. 

News March 27, 2025

గుంటూరు ఛానల్‌ ఆధునీకీకరణ చేస్తాం: సీఎం 

image

గుంటూరు ఛానల్‌ ఆధునీకీకరణ, విస్తరణ పనులు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడిలో జిల్లా కలెక్టర్‌ల ముగింపు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గుంటూరు నగరపాలక సంస్థలో పెండింగ్‌లో ఉన్న యూజీడీ పనులు పూర్తిచేస్తామన్నారు. ఎంటీఎంసీ పరిధిలో యూజీడీ, తాగునీటి సరఫరాకు సీఆర్డీఏ ద్వారా నిధులు కేటాయిస్తామన్నారు. చినకాకాని, మల్లయపాలెం వద్ద ఇండస్ట్రీ పార్క్‌కు భూసేకరణకు నిధులు మంజూరు చేస్తామన్నారు. 

error: Content is protected !!