News April 2, 2025
గుంటూరు: మద్యం సీసాతో దాడి.. ఒకరి మృతి

గుంటూరు శివారు రెడ్డిపాలెంలో ఒకరు హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామ్ నాయక్ (60) కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తాడు. రాజుతో కలిసి ఇద్దరు మద్యం తాగారు. ఇద్దరి మద్య వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాజు మద్యం బాటిల్‌తో రామ్‌నాయక్‌పై దాడి చేశాడు. దీంతో రామ్ నాయక్ స్పాట్‌లోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 24, 2026
HMDA పరిధిలోకి వికారాబాద్ జిల్లాలోని 4 గ్రామాలు

విస్తరణలో భాగంగా మరో నాలుగు గ్రామాలను HMDA పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్‌పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను HMDA పరిధిలో చేర్చారు. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. GHMC ఆధ్వర్యంలో CRMP phase 2 చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్!

ఝార్ఖండ్‌లోని రాంచీలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ఏడుగురితో ఢిల్లీకి బయల్దేరిన కాసేపటికే ఛత్రా జిల్లాలోని కర్మటండ్ గ్రామంలో క్రాష్ అయింది. ఒకరు చనిపోయారని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.