News March 23, 2024

గుంటూరు మిర్చియార్డుకు వరుస సెలవులు

image

గుంటూరు మిర్చియార్డుకు వరుసగా సెలవులు వచ్చాయి. శని, ఆదివారాలు వారాంతపు సెలవులతో పాటు సోమవారం హోలీ సందర్భంగా సెలవు ప్రకటించారు. దీంతో యార్డులో 3 రోజులు పాటు క్రయవిక్రయాలు జరగవు. కర్ణాటకలో బాడిగ మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు పునఃప్రారంభం కావడంతో.. ఆ ప్రాంత రైతులు అక్కడికే సరకు తరలిస్తున్నారు. దీంతో శుక్రవారం ఒక్కసారిగా మిర్చియార్డుకు సరకు తగ్గింది.

Similar News

News September 11, 2024

ఎమ్మెస్సీ, ఎం.టెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

image

గుంటూరు ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ, ఎం.టెక్, పీహెచ్ఎ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును అక్టోబరు 10వ తేదీ వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని హార్డ్ కాపీలను యూనివర్సిటీలో అందజేయాలన్నారు.

News September 11, 2024

తెనాలి: యువతి ఫిర్యాదుతో యువకుడిపై కేసు

image

యువకుడు మోసం చేశాడని గుంటూరుకు చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. యువతి ఇంటర్ చదువుతున్న సమయంలో తెనాలికి చెందిన యశ్వంత్ పరిచయం అయ్యాడు. యశ్వంత్ ఈ సంవత్సరం జూన్ నెలలో తన ఇంటికి పిలిచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని తెనాలి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

News September 11, 2024

గుంటూరు: ఏఏస్ఐలకు ప్రమోషన్

image

గుంటూరు రేంజ్ పరిధిలో ఏడుగురు ఏఏస్ఐలకు ఎస్ఐలుగా ప్రమోషన్ కల్పిస్తూ సౌత్ కోస్టల్ జోన్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశంలో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు ఏఏస్ఐలు ఈ జాబితాలో ఉన్నారు. వీరికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఫోస్టింగ్స్ ఇస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.