News October 31, 2024
గుంటూరు మిర్చి యార్డుకు నేడు సెలవు
గుంటూరు మార్కెట్ యార్డుకు దీపావళి పండుగను పురస్కరించుకొని గురువారం సెలవు ప్రకటించినట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు తెలిపారు. శుక్రవారం యార్డులో యథావిధిగా క్రయ విక్రయాలు జరుగుతాయని చెప్పారు. శని, ఆదివారం సాధారణ సెలవులు ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రైతుల మిర్చి యార్డుకు సరుకు తీసుకురావద్దని చెప్పారు.
Similar News
News November 6, 2024
డిసెంబర్ 15లోపు అందుబాటులోకి తేవాలి: గుంటూరు కలెక్టర్
గుంటూరు నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. ప్రాంతీయ గ్రంథాలయాన్ని, పాత గుంటూరులోని ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్ భవనాన్ని డిసెంబర్ 15లోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు.
News November 6, 2024
CRDA పరిధిలోకి పల్నాడు జిల్లా.. కేబినెట్ ఆమోదం
సీఆర్డీఏ పరిధి పెంచుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా సీఆర్డీఏ పరిధిలోకి చేరింది. సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 1069.55 చదరపు కి.మీ విస్తీర్ణం, పల్నాడు జిల్లాలోని 92 గ్రామాలు, బాపట్ల జిల్లాలోని 62 గ్రామాలను చేర్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని అభివృద్ధి నిధులతో పల్నాడు మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 6, 2024
విద్యాసంస్థల వద్ద నిఘా పెంచాలి: గుంటూరు ఎస్పీ
క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో శాంతిభద్రత సమస్యలను పరిష్కరించాలని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌ని ఎస్పీ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరను స్వయంగా పరిశీలించారు. మహిళా ఫిర్యాదిదారుల కోసం ప్రత్యేక వెయిటింగ్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని, పెండింగ్ వాహనాలను త్వరగా డిస్పోస్ చేయాలని ఆదేశించారు.