News July 13, 2024

గుంటూరు మిర్చి యార్డుకు 21,027 టిక్కీలు

image

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 21,027 టిక్కీల మిర్చి రాగా పాత నిల్వలతో కలిపి 25,626 టిక్కీలు విక్రయించారు. ఇంకా 12,347 టిక్కీలు నిల్వ ఉన్నాయి. నాన్ ఎసి కామన్ వెరైటీలు సగటున కనిష్ట ధర రూ.8వేలు పలకగా గరిష్టంగా రూ.16 వేలు పలికింది. నాన్ ఏసీ స్పెషల్ వెరైటీలు కనిష్టంగా రూ.8 వేలు, గరిష్టంగా రూ.18,600 లభించాయి. ఏసీ కామన్ వెరైటీలు సగటు కనిష్ట ధర రూ.8500, గరిష్ట ధర రూ.16,500 పలికింది.

Similar News

News October 25, 2025

సెస్సు బకాయిలపై దృష్టి సారించాలి: జేసీ

image

గ్రంథాలయ సెస్సు బకాయిల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. గ్రంథాలయ సెస్సు సమీక్షా సమావేశం శనివారం కలెక్టరేట్‌లో జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రంథాలయ సంస్థ సెస్సు బకాయిలు రూ. 64, 36,14,822లు ఉన్నాయని చెప్పారు. సెస్ బకాయిలు తక్షణమే వసూలు చేయాలని జేసీ ఆదేశించారు.

News October 25, 2025

పోలీస్ ప్రతిష్ఠను కాపాడండి: ఎస్పీ

image

పోలీస్ ప్రతిష్ఠ, గౌరవం, అధికారాన్ని కాపాడే విధంగా సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి శనివారం సెట్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బందితో ఆయన మాట్లాడారు. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ లాఠీ, విజిల్ తమతో ఉంచుకోవాలని, అవసరమైతే వాటిని చట్టబద్ధంగా ఉపయోగించాలని ఎస్పీ సూచించారు.

News October 25, 2025

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద అప్టేట్

image

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం నెమ్మదిగా పెరుగుతోంది. శనివారం సాయంత్రం 4.00 గంటల వరకు బ్యారేజీ వద్ద 11.6 అడుగుల నీటిమట్టం నమోదైంది. సర్ ప్లస్ ప్రవాహం 85,360 క్యూసెక్కులుగా ఉంది. కె.ఇ. మెయిన్ కెనాల్‌కు 511 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, బ్యారేజీ వద్ద మొత్తం నీటి పరిమాణం 85,871 క్యూసెక్కులుగా ఉంది.