News November 20, 2024
గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలు

గుంటూరు మిర్చి యార్డుకు బుధవారం సుమారుగా 1,00,000 ఏ/సి రకాలు చేరాయి. కేజీల వారీగా సీడు రకాల ధరలు ఇలా ఉన్నాయి. తేజా బెస్ట్ రూ.130-135, సూపర్ డీలక్స్ రూ.160, తేజా మీడియం రూ.100-120, 355 భెడిగి బెస్ట్ రూ.110-130, 2043 భెడిగి రూ.120-130, 341బెస్ట్ రూ.120-150, 341.BCM రూ.120-140, సీజెంటా భెడిగి రూ.110-120, నె:5 రకం రూ.120-150, షార్క్ రకాలు రూ.110-150 వరకు ధర లభించింది.
Similar News
News March 6, 2026
అమరావతిలో ‘నైలిట్’ కేంద్రం ఏర్పాటు

అమరావతిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (నైలిట్) కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపింది. నైలిట్ ప్రతినిధులు డా.జయరాజ్, డా.లక్ష్మణ్ కొర్రా ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ముందుగా తాత్కాలిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా యువతకు ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో డిజిటల్ నైపుణ్యాలు, మెరుగైన శిక్షణ అందుబాటులోకి రానున్నాయి
News March 6, 2026
GNT: రైల్వే గేట్ మూసినా ముందుకెళ్తే.. ప్రమాదం తప్పదు..!

ప్రజలు రైల్వే క్రాసింగ్‌లు దాటేటప్పుడు అధికారుల సూచనలు పాటించి నిబంధనలకు లోబడి ప్రవర్తిస్తే ప్రమాదాలను నివారించవచ్చని గుంటూరు డివిజన్ DSO కీర్తి తెలిపారు. గేట్ మూసిన తర్వాత కూడా కొందరు నిర్లక్ష్యంగా దాటేందుకు ప్రయత్నించడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విజయవాడ–గుంటూరు–తెనాలి మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో జిల్లాల్లో ప్రతి ఏడాది 30–60 రైల్వే సంబంధిత మరణాలు నమోదవుతున్నాయి.