News December 5, 2024
గుంటూరు మిర్చి యార్డ్ తరలింపు

200 ఎకరాల్లో, అత్యాధునిక సౌకర్యాలతో నూతన మిర్చి యార్డును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నడుస్తున్న గుంటూరు మిర్చి యార్డ్‌పై అనేక విధాలుగా ఒత్తిడి పడుతోందని చెప్పారు. అందరి అభిప్రాయం మేరకు యార్డును తరలిస్తామన్నారు. ఆ స్థలాన్ని వేరే ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తామని ప్రకటించారు.
Similar News
News October 28, 2025
అవసరమైతే సహాయ చర్యలు చేపట్టండి: లోకేశ్

మొంథా తుఫాను తీవ్రతను సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి మంత్రి నారా లోకేశ్ మంగళవారం సమీక్షించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుఫాను పరిస్థితులను నిరంతరం అంచనా వేయాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కూటమినేతలు, కార్యకర్తలు ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.
News October 28, 2025
గుంటూరు జిల్లాలో ప్రారంభమైన ముంతా తుపాన్ ఎఫెక్ట్

గుంటూరు జిల్లాలో మొంథా తుపాన్ ప్రభావం ప్రారంభమైంది. తెనాలి, గుంటూరు, మంగళగిరి, కొల్లిపర మండలాల్లో గాలివానలు ముప్పు రేపుతున్నాయి. భారీ గాలి వేగంతో చెట్లు ఊగిపోతుండగా, కొన్ని చోట్ల గాలితో కూడిన వర్షం పడుతుంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనలు జారీ అయ్యాయి.
News October 28, 2025
తుపాను ప్రభావం.. జగన్ తాడేపల్లి పర్యటన వాయిదా

మొంథా తుపాను ప్రభావంతో విమాన సర్వీసులు రద్దు కావడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తాడేపల్లి పర్యటనను వాయిదా వేశారు. గన్నవరం విమాన సర్వీసులు పునరుద్ధరించగానే రేపు ఆయన రావచ్చని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. తుపాను బాధితులు అప్రమత్తంగా ఉండాలని, సహాయ చర్యల్లో పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు.


