News December 5, 2024

గుంటూరు మిర్చి యార్డ్ తరలింపు 

image

200 ఎకరాల్లో, అత్యాధునిక సౌకర్యాలతో నూతన మిర్చి యార్డును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నడుస్తున్న గుంటూరు మిర్చి యార్డ్‌పై అనేక విధాలుగా ఒత్తిడి పడుతోందని చెప్పారు. అందరి అభిప్రాయం మేరకు యార్డును తరలిస్తామన్నారు. ఆ స్థలాన్ని వేరే ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తామని ప్రకటించారు.

Similar News

News January 22, 2025

అధికారులకు గుంటూరు కలెక్టర్ సూచనలు

image

తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆక్రమిత ప్రాంతాల్లోని నివాసాలను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా రెగ్యులరైజేషన్ చేయడానికి సంబంధిత శాఖలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, రైల్వే, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వేలో 16,025 నివాసాలు గుర్తించామన్నారు.

News January 21, 2025

గుంటూరు పట్టణంలో భారీ పేలుడు

image

గుంటూరులోని బ్రాడీపేట ఆరోలైను 18వ అడ్డరోడ్డు వద్ద సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఒక ఇంట్లో నుంచి వచ్చిన పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రమాదంలో ఇంటి యజమాని గన్ సైదా 8ఏళ్ల కుమార్తె గాయపడింది. విద్యుత్ఘాతంతో పేలుడు సంభవించిందని క్లూస్ టీం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. పట్టాభిపురం పోలీసులు రంగం ప్రవేశం చేసి ఇళ్లల్లో తనిఖీలు చేయగా పేలుడు పదార్థాలేమీ లభ్యం కాలేదు.

News January 21, 2025

హౌసింగ్ లే అవుట్స్ లక్ష్యాలను అధిగమించాలి: కలెక్టర్

image

హౌసింగ్ లే అవుట్స్‌లో ప్రతీవారం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా అధికారులు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండలస్థాయి అధికారులు సోమవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంక్ లింకేజీ రుణాలు అందించేలా చూడాలని చెప్పారు.