News July 22, 2024

గుంటూరు: మీ MLA ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారు?

image

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ గళం వినిపించనుండగా.. వారిలో నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరి మీ నియోజకవర్గ MLA అసెంబ్లీలో ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి.

Similar News

News October 8, 2024

నేడు లేదా రేపు TDPలోకి మోపిదేవి వెంకటరమణ..?

image

YCP మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ నేడు లేదా రేపు TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. సొంత నియోజకవర్గమైన రేపల్లె, విజయవాడలోని తన సామాజికవర్గ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన TDP కండువా కప్పుకోనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్న హయాంలో మోపిదేవి మంత్రిగా పనిచేశారు. ఇటీవల ఆయన YCPకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

News October 8, 2024

తుళ్ళూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణ

image

కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణ జరిగిన ఘటన తుళ్ళూరులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంభంపాటి శేషగిరిరావు, పావని దంపతులు. కొంతకాలంగా అత్త, కోడలికి మధ్య వైరం నడుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం కోడలి తరఫు బంధువులు, అత్తవైపు వారు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో కోడలు అత్త చెవి కొరకడంతో సగభాగం ఊడి కింద పడిపోయింది. గుంటూరు ఆస్పత్రికి తీసుకెళ్లినా అతికించలేమని వైద్యులు చెప్పారు.

News October 8, 2024

నేటి నుంచి ANUలో రాష్ట్ర స్థాయి సీనియర్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మంగళవారం నుంచి 4రోజులు రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల సీనియర్ పురుషుల ఫుట్ బాల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి ప్రదీప్ తెలిపారు. ఈ ఛాంపియన్షిప్లో రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన పురుషుల జట్లు పాల్గొంటాయన్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీల్లో ప్రతిభ గల క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారన్నారు.