News January 24, 2025

 గుంటూరు: మూడు రోజులు పోలీసు కస్టడీకి తులసి బాబు

image

RRRను చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసి బాబును మూడు రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ శుక్రవారం ఆదేశించారు. నగరంపాలెం పోలీసులు దాఖలు చేసిన ఈ కేసులో ఒంగోలు ఎస్పీ విచారణాధికారి. ఐదు రోజుల కస్టడీకి పిటీషన్ దాఖలు చేయగా, తులసి తరఫు న్యాయవాదులు అందుకు నిరాకరించారు. కేసు పూర్వపరాలు, వాదోపవాదాల అనంతరం మూడు రోజుల కస్టడీకి అనుమతించారు.

Similar News

News February 15, 2025

తాడికొండలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

తాడికొండ మండల పరిధిలోని బేజాత్ పురం గ్రామ పొలాల్లో గుర్తుతెలియని వృద్ధురాలి (70) మృతదేహం లభ్యమైంది. తాడికొండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘటనా స్థలానికి ఎస్ఐ జైత్యా నాయక్ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. వీఆర్వో రవిబాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. వృద్ధురాలి ఆచూకీ తెలిసినవారు తాడికొండ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.

News February 15, 2025

తెనాలి: కత్తితో దాడి.. వ్యక్తి మృతి

image

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో తెనాలి నాజరుపేటకు చెందిన గొంది బసవయ్యపై ఇస్లాంపేటకు చెందిన జూపల్లి వేణు, అతని స్నేహితుడు రాము కత్తితో గొంతుపై దాడి చేసిన విషయం తెలిసిందే. గత నెల 31న ఈ ఘటన జరుగగా బసవయ్య తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అప్పట్లో బాధితుడి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బాధితుడి మృతితో కేసును హత్య కేసుగా మార్చారు.

News February 15, 2025

GNT: మహిళల కోసం రూ. 4 కోట్లతో ప్లాటెడ్ ఫ్యాక్టరీ

image

స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామిక వేత్తలను చేసేందుకు ప్రభుత్వం ప్లాటెడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ర్ టి. విజయలక్ష్మి అన్నారు. మంగళగిరి, దుగ్గిరాల మండలంలో రు.4 కోట్లతో ఫ్యాక్టరీ ఏర్పాటుకై స్థలం కోసం తహశీల్దార్‌తో మాట్లాడగా సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. దుగ్గిరాల ఎంపీడీఓ కార్యాలయంలో పీడీ అధికారులతో మాట్లాడారు. ఎపీఎం సురేశ్ పాల్గొన్నారు.

error: Content is protected !!