News February 28, 2025
గుంటూరు: మైనర్ బాలికపై అత్యాచారం

ఉమ్మడి గుంటూరు (D) నగరం మండలంలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై 17ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరం ఎస్ఐ బండ్ల భార్గవ్ వివరాల ప్రకారం.. ఈనెల 25న ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని బలవంతంగా దగ్గరలో ఉన్న స్కూల్ బస్సులోకి లాక్కొని వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News February 28, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

> ఖమ్మం:ఉద్యోగ విరమణ పొందిన పోలీసులకు సీపీ సన్మానం> సత్తుపల్లి: కార్యకర్తలపై ఎమ్మెల్యే అసహనం> ఖమ్మం: రూ.3 లక్షల మిర్చి పంట చోరీ> బోనకల్: 2 కార్లు డీ.. ఇద్దరికి గాయాలు> ముదిగొండ: బిల్డింగ్ పై నుంచి పడి కార్మికుడి మృతి> తిరుమలాయపాలెం:యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు >సత్తుపల్లి: మంత్రి తుమ్మల అనుచరుడు గాదె సత్యం మృతి
News February 28, 2025
శాంతి కుమారి కాన్ఫరెన్స్లో కలెక్టర్ త్రిపాఠి

నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారికి తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు.
News February 28, 2025
రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

AP: రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటర్ ఫస్టియర్, 3వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు మొదలుకానున్నాయి. 10.58 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటుచేశారు. అన్ని సెంటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. స్టూడెంట్స్ గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.