News April 25, 2024

గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునీకరణ పనులు కారణంగా విశాఖ నుంచి, విశాఖ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేశారు. గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ ను మే 27 వరకు, కాకినాడ-విశాఖ-కాకినాడ ఎక్స్ ప్రెస్ మే 26 వరకు రద్దు చేసినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 10, 2025

శబరిమలకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు

image

విశాఖపట్నం నుంచి శబరిమల వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీలతో బస్సులు నడుపుతోందని రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. పంచరామాల యాత్రలా శబరిమలైకి కూడా విశేష స్పందన లభించిందన్నారు. నవంబర్ 19-23 వరకు పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా డిమాండ్ మేరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు. బస్సుల వివరాల కోసం ద్వారక బస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

News November 9, 2025

షీలా నగర్ జంక్షన్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

షీలా నగర్ జంక్షన్‌లో ఆదివారం రాత్రి బైక్‌పై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి తల పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వడంతో గుర్తించడానికి వీలు లేని విధంగా అయిపోయింది. పోలీసులు వివరాల సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియల్సి ఉంది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలంలో ఉన్నారు.

News November 9, 2025

‘ప్రజా ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరించిన కురసాల కన్నబాబు

image

విశాఖ వైసీపీ కార్యాలయంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో ఆదివారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతులు మీదుగా “ప్రజా ఉద్యమం” పోస్టర్ ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీల ప్రవేటికరణకు వ్యతిరేకంగా నవంబర్-12 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.