News September 6, 2024
గుంటూరు రేంజ్ ఐజీని కలిసిన MLA ఉగ్ర

గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కనిగిరి MLA ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం గుంటూరు ఐజీ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MLA ఉగ్ర మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలని ఐజీని కోరినట్లు తెలిపారు. పోలీసు అధికారులకు తమ సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.
Similar News
News July 9, 2025
ప్రకాశం జిల్లాలోని ఈ పాఠశాల్లో ఒక్కరు కూడా చేరలేదు.!

అత్యధికంగా HMపాడులో 10, కొమరులులో 8, CS పురంలో, కనిగిరి, రాచర్ల మండలాల్లో 5 స్కూళ్లల్లో అడ్మిషన్లు నమోదు కాలేదు. బీపేట, దర్శి, దొనకొండ, మద్దిపాడు, నాగులుప్పలపాడు, పొదిలి, సింగరాయకొండ, త్రిపురాంతంకంలో ఒక్కో స్కూల్లో ఎవరూ చేరలేదు. ఒంగోలు, టంగుటూరు మండలాల్లో 3, చీమకుర్తి, కొండపి, కురిచేడులో రెండేసి సూళ్లల్లో అడ్మిషన్లు లేవు.
News July 9, 2025
ఒంగోలు: 17 నెలల చిన్నారికి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్

ఒంగోలులోని సత్యనారాయపురానికి చెందిన చిన్నారి అంబటి ఖశ్విని ఎస్పీ దామోదర్ మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. 17 నెలల వయస్సులోనే ఖశ్వి 24 వేర్వేరు కేటగిరీల్లో 650కి పైగా ఇంగ్లిష్ పదాలను మాట్లాడడంతో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. దీంతో చిన్న వయస్సులోనే అద్భుత రికార్డ్ సృష్టించిన చిన్నారిని, తల్లిదండ్రులను ప్రశంసించారు.
News July 9, 2025
బీఎల్ఓల భాద్యతే కీలకం: ఇన్‌ఛార్జి కలెక్టర్

పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడంలో బీఎల్ఓల భాద్యతలు కీలకమని ఇన్ఛార్జి కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మంగళవారం బీఎల్ఓల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భాద్యతలు నిర్వర్తించాలన్నారు.