News August 8, 2024
గుంటూరు రేంజ్ పరిధిలో పలువురు సీఐలు బదిలీ

గుంటూరు రేంజ్ పరిధిలో పలువురు సీఐలు బదిలీపై నెల్లూరు జిల్లాకు వచ్చారు. నెల్లూరు నవాబుపేటకు అన్వర్ బాషా, దర్గామిట్టకు ఎం.రోశయ్య, ఆత్మకూరుకు జి.గంగాధర్ రావు, గూడూరు సర్కిల్ కు జి. మంగారావు, గూడూరు వన్ టౌన్‌కు కే. శేఖర్ బాబు, వాకాడుకు ఎస్.హెచ్ హుస్సేన్ బాషా, నాయుడు పేటకు ఎం.బాబీ, సుళ్లూరుపేటకు ఎం.మురళీకృష్ణ బదిలీ అయ్యారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజి ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News April 11, 2026
నెల్లూరు జిల్లాలో పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్

నెల్లూరు జిల్లాలో కొత్తగా రెండు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దుత్తలూరు మండలం పాపంపల్లెలో డిఫెన్స్ రా మెటీరియల్ తయారీ యూనిట్ కోసం 349.95 ఎకరాలు కేటాయించడానికి ఓకే చెప్పింది. ఇక్కడ రూ.1000కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. అలాగే మనుబోలు మండలం మడమనూరు వద్ద 250 ఎకరాల్లో రూ.3500 కోట్లతో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ 3వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.
News April 11, 2026
నెల్లూరు: నేటి నుంచి చేపల వేట బంద్

61 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలు సంతానోత్పత్తి పెరిగే సమయం కావడంతో ఈ సమయంలో వేట నిషేధించినట్లు పేర్కొన్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో నేటి నుంచి చేపల వేట ఆగిపోనుంది. సముద్ర జలాలలో యాంత్రిక పడవలు, మోటారు బోట్ల ద్వారా చేపల వేట సాగించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.
News April 11, 2026
నేర నియంత్రణే లక్ష్యం: నెల్లూరు ఎస్పీ

నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ సమీక్షలో ఎస్పీ డా. అజిత వేజెండ్ల పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. డ్రోన్ సర్వైలెన్స్, సీసీటీవీ వంటి స్మార్ట్ పోలీసింగ్ టెక్నాలజీతో నేరాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, రాత్రి గస్తీలు ముమ్మరం చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


