News December 26, 2024
గుంటూరు: రైల్లో నుంచి పడి మహిళ మృతి

రాజమండ్రిలోని గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో సింహాద్రి ఎక్సప్రెస్ రైలు నుంచి జారిపడటంతో గుంటూరుకు చెందిన హేమలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె రైలు నుంచి జారి పడడంతో గోదావరి స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాధాకృష్ణ స్థానికులు సాయంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్లో చేర్చగా బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్ఐ లోవరాజు తెలిపారు.
Similar News
News November 18, 2025
ANU: థర్డ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం బిఈడి థర్డ్ సెమిస్టర్, పీజీ సైన్స్, ఆర్ట్స్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈడి, ఎల్.ఎల్.బి పరీక్షలు ప్రారంభమయ్యాయి. థర్డ్ సెమిస్టర్ 22 పరీక్షా కేంద్రాల్లోను, ఎల్.ఎల్.బి గుంటూరులో మూడు పరీక్ష కేంద్రాలు, ప్రకాశం జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. వర్సిటీ పరీక్షల సమన్వయకర్త ఆచార్య ఎం.సుబ్బారావు పరీక్షలు తీరును పరిశీలించారు.
News November 18, 2025
మంగళగిరి: భార్యను హత్య చేసిన భర్త

మంగళగిరి పరిధి యర్రబాలెంలో వివాహిత హత్యకు గురైంది. CI బ్రహ్మం, SI వెంకట్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. వారి వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన కిలిమి లక్ష్మీ (29) 5 ఏళ్ళ క్రితం శంకర్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. కలహాలతో విడిపోయి, చినకాకానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తూ యర్రబాలెంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త శంకర్ రెడ్డి గొంతునులిమి హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
News November 18, 2025
ANU: LLB రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన LLB రీవాల్యుయేషన్ ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. LLB VI, X సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధించిన అధికారులను సంప్రదించాలన్నారు.


