News March 19, 2024
గుంటూరు రైల్వేస్టేషన్లో వ్యక్తి మృతి

గుంటూరు రైల్వేస్టేషన్లో మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై జీఆర్పి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్‌పై మంగళవారం ఓ వ్యక్తి మృతిచెంది ఉన్నాడనే సమాచారంతో సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతుని చేతికి సెలైన్ ఎక్కించుకున్న బ్యాండేజ్ ఉంది. మృతుడి వివరాలు తెలియరాలేదని, గుర్తుపట్టినవారు జీఆర్పి పోలీసులను సంప్రదించాలన్నారు.
Similar News
News February 11, 2025
జేఈఈ మెయిన్-2025 ఆలిండియా టాపర్‌గా భాష్యం విద్యార్థిని

జేఈఈ మెయిన్-2025 జనవరి ఫలితాలలో భాష్యం అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. సెషన్-1 ఫలితాలలో భాష్యం విద్యార్థి గుత్తికొండ సాయిమనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించిన ఏకైక తెలుగు విద్యార్థిగా నిలిచింది. మరెంతో మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. భాష్యం ప్రత్యేక కరికులంతోనే ఈ విజయం సాధ్యమైందని తెలుయజేస్తూ.. విద్యార్థులను, అధ్యాపకులను సంస్థ యాజమాన్యం అభినందించింది.
News February 11, 2025
వైసీపీ పంచాయితీరాజ్ విభాగం డైరీ ఆవిష్కరణ

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైసీపీ పంచాయితీరాజ్ విభాగం డైరీ 2025ను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆవిష్కరించారు. గ్రామ స్వరాజ్యం స్ధాపనకు గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, స్ధానిక సంస్ధల బలోపేతంతో పాటు ఆర్ధికంగా వాటిని స్వయంసమృద్ధి దిశగా తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు.
News February 11, 2025
గుంటూరులో పల్నాడు మిర్చిరైతుల ధర్నా !

పల్నాడు జిల్లా గ్రంథసిరి అచ్చంపేట మండలానికి చెందిన మిర్చి రైతులు మంగళవారం గుంటూరు మిర్చియార్డు వద్ద ధర్నాకు దిగారు. యార్డులోని విజయభాస్కర ట్రేడర్స్ యజమానులు శ్రీనివాస్ రెడ్డి, కిషోర్ రెడ్డి భాగస్వాములుగా ఉండి గతేడాది తమ పంటపై వచ్చిన లాభాలతో పాటూ అదనంగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఐదుగురు రైతుల వద్ద రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.50 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.