News May 12, 2024
గుంటూరు: రైళ్లకు అదనపు బోగీలు

ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. నేటి నుంచి 15వ తేదీ వరకు కాచిగూడ- గుంటూరు, కాచిగూడ-రేపల్లె, 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రేపల్లె-సికింద్రాబాద్ రైళ్లకు అదనపు బోగీలు ఉంటాయన్నారు. ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు సికింద్రాబాద్-రేపల్లె రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 20, 2025
బ్యాలెట్ బాక్స్‌లను సక్రమంగా భధ్రపరచాలి: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూంలో సక్రమంగా భద్రపరచాలని గుంటూరు జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎన్నికలకు విధులు కేటాయించిన అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా బ్యాలెట్ బాక్స్‌లు తీసుకునేటప్పుడు సీల్ పూర్తి స్థాయిలో వేసారా లేదా తనిఖీ చేసి బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు.
News February 19, 2025
జీబీఎస్‌తో గుంటూరు మహిళ మృతి

గిలియన్ బారో సిండ్రోమ్ (GBS)తో గుంటూరు నెహ్రూనగర్‌కి చెందిన మహిళ మరణించారు. ఒళ్ళు నొప్పులు, జ్వరంతో బాధపడుతూ గత కొద్దిరోజుల క్రితం నెహ్రూనగర్‌కి చెందిన గౌర్ జాన్ (65) జీజీహెచ్‌లో చేరారు. మొదటి మరణం సంభవించినప్పుడు జీబీఎస్ అంత ప్రమాదం ఏమీ కాదని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి చెప్పారు. కానీ ఇప్పుడు నగరానికి చెందిన మహిళ చికిత్స పొందుతూ మరణించడంతో గుంటూరు నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
News February 19, 2025
గుంటూరు: MDMA వినియోగిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్ట్

MDMA నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తూ, వినియోగిస్తున్న 9 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను గుంటూరు ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన నితిన్ కాజ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సాయికృష్ణకు MDMA విక్రయించాడు. ఆ మత్తు పదార్థాలను సాయికృష్ణ గోరంట్లలో ఉంటూ ఇంజినీరింగ్ కళాశాలలకు విక్రయించాడు. మొత్తం 11 మంది ఉండగా 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.