News April 11, 2024
గుంటూరు వచ్చే పలు రైళ్లు రద్దు

ఇంజనీరింగ్ పనుల నిమిత్తం నేటి నుంచి 30వ తేదీ వరకు విజయవాడ – గుంటూరు 07464, గుంటూరు – విజయవాడ 07465, గుంటూరు – విజయవాడ 07976 రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. హుబ్లీ – విజయవాడ 17329 రైలుని ఈ నెల 29 వరకు, విజయవాడ – హుబ్లీ 17330 రైలును ఈ నెల 30 వరకు విజయవాడ – గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు.
Similar News
News November 8, 2025
రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు: మంత్రి నారాయణ

రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రోడ్లు, తాగు నీరు, డ్రైనేజీలు, వీధి దీపాల ఏర్పాటు పనులు మొదలు పెడతామని చెప్పారు. కాగా రాజధాని అమరావతికి భూసమీకరణ ద్వారా భూములిచ్చిన రైతులు నివసించే గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది.
News November 8, 2025
GNT: 19ఏళ్లలో 500 చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు

తెలుగు చిత్ర హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు AVSగా పేరు గాంచిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం గుంటూరు (D) తెనాలిలో జన్మించారు. ఆంధ్రజ్యోతిలో పాత్రికేయుడుగా కేరీర్ ప్రారంభించిన AVS, మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. 19ఏళ్లలో AVS 500 చిత్రాల్లో నటించాడు. అంకుల్ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారారు. ఆయనకు తన కుమార్తె లివర్ దానం చేశారు. కాగా నేడు NOV 8 ఆయన వర్ధంతి.
News November 8, 2025
నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం కేంద్ర కార్యాలయాన్ని సందర్శించనున్నారు. ఆయన పార్టీ కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చర్చించనున్నారు. అలాగే, పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర కమిటీ కూర్పు వంటి ముఖ్య అంశాలపై ఆయన పార్టీ నేతలతో చర్చలు జరపనున్నాయి.


