News March 10, 2025

గుంటూరు: వరల్డ్ నంబర్ 1 ర్యాంకింగ్ మనోడికే.! 

image

గుంటూరుకు చెందిన అరిగెల భార్గవ్ బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. తాజాగా జూనియర్ వరల్డ్ ర్యాంకింగ్స్ డబుల్స్ విభాగంలో ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన గొబ్బూరి విశ్వతేజతో కలిసి వరల్డ్ నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు భార్గవ్‌ను అభినందిస్తున్నారు. 

Similar News

News March 14, 2026

గుంటూరు: కోర్టు మెట్లపై మళ్లీ ఒక్కటైన ఆరు జంటలు

image

గుంటూరులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో వరకట్న వేధింపులు, భరణం కేసులతో కోర్టును ఆశ్రయించిన ఆరు జంటలను న్యాయమూర్తి లత చొరవతో తిరిగి కలిపారు. దంపతులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించి దాంపత్య బంధాన్ని కొనసాగించేందుకు ఒప్పించారు. న్యాయమూర్తి లత కృషిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ ప్రక్రియలో సహకరించిన న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

News March 14, 2026

తుళ్లూరు: CMరాక ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 16న తుళ్లూరులో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఈ కార్యక్రమంలో భాగంగా తుళ్లూరులో ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. తుళ్లూరులో ఆర్యవైశ్య ట్రస్టుకు ప్రభుత్వం కేటాయించిన 6.80 ఎకరాల స్థలంలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

News March 14, 2026

తెనాలిలో ఇనుప చట్రంతో పొట్టి శ్రీరాములు అద్భుత విగ్రహం

image

తెనాలికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. ఈ నెల 16న పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా 2 టన్నుల ఐరన్ స్ర్కాప్‌‌తో తయారు చేసిన విగ్రహాన్ని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనగా ఉంచారు. ఇంద్రకీలాద్రి పాలక మండలి సభ్యులు తోటకూర రమణారావు, బీసీ సంఘ అధ్యక్షుడు కేసన శంకరరావు విగ్రహాన్ని తిలకించి శిల్పులను అభినందించారు.