News December 25, 2024
గుంటూరు: వస్తువుల కొనుగోలులో వినియోగదారులు అప్రమత్తం
జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని కలెక్టరేట్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. మనిషి పుట్టుకతోనే వినియోగదారుని జీవితం మొదలవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు తాము కొనే వస్తువు నాణ్యత కలిగి ఉండేలా చూసుకోవాలని చెప్పారు. తమకు ఎలాంటి మోసం జరిగిందని గ్రహించిన వెంటనే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
Similar News
News January 26, 2025
ANU: వన్ టైం ఆపర్చునిటీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ విద్యార్థులకు రెగ్యులర్, సప్లమెంటరీలతో పాటు 4వ సెమిస్టర్ లో వన్ టైం ఆపర్చునిటీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సీఈ ఆలపాటి శివప్రసాదరావు శనివారం తెలిపారు. ఫిబ్రవరి 20లోగా ఫీజులు చెల్లించాలన్నారు. రూ.100 అపరాదంతో ఫిబ్రవరి 24లోపు ఫీజు చెల్లించవచ్చన్నారు. ఫీజుల వివరాలు, పరీక్షల షెడ్యూల్ www.anu.ac.in వెబ్ సైట్ నుంచి పొందవచ్చుని తెలిపారు.
News January 25, 2025
మంగళగిరి: ఏపీఎస్పీ కానిస్టేబుల్ అదృశ్యం
మంగళగిరి పరిధిలోని ఏపీఎస్పీ 6వబెటాలియన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని ఆయన భార్య రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు శనివారం లిఖితపూర్వకంగా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ స్టేషన్ సిబ్బంది తెలిపారు.
News January 24, 2025
నిఘా పెట్టి.. నేరాలు నియంత్రణ చేయాలి: ఎస్పీ
గుంటూరు జిల్లా నేర విభాగం పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ సతీష్ కుమార్ తనిఖీ చేశారు. నేరాల దర్యాప్తు, చోరీకి గురైన సొమ్ము రికవరీ తీరు తదితర అంశాల గురించి అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాలు జరగకుండా తగిన నిఘా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జైలు నుంచి వచ్చిన నేరస్తులు, దొంగల కదలికలపై నిఘా పెట్టి నేరాలు జరుగకముందే వాటిని కట్టడి చేయాలన్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ సుప్రజ ఉన్నారు.