News February 13, 2025
గుంటూరు: వేసవి తాపాన్ని తీరుస్తున్న పుచ్చకాయలు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా పుచ్చకాయలు అందుబాటులో ఉన్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనంతో పాటు పోషక విలువ అధికంగా ఉండడంతో వీటి కొనుగోలు కోసం ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కిలో పుచ్చకాయ ధర రూ.40 నుంచి రూ.45 పలుకుతోంది. ధరలు కాస్తా అధికంగా ఉన్నప్పటికీ ప్రజలు తింటున్నారు. ఎండ వేడిమిని తట్టుకోవడానికి ఇవి ఎంతో మేలు చేస్తాయని ప్రజలు భావిస్తున్నారు. వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు.
Similar News
News December 4, 2025
దుగ్గిరాలలో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్ పసుపు రూ.12,500 గరిష్ఠ ధర పలికింది. యార్డులో గురువారం నిర్వహించిన వేలంలో పసుపు కొమ్ముల ధర రూ.8,500 నుంచి రూ.12,500 పలకగా కాయ రకం పసుపు ధర రూ. 8,550 నుంచి రూ.12,500 వరకు పలికినట్లు అధికారులు తెలిపారు. రైతులు యార్డుకు తెచ్చిన పసుపు పంటలో 684 బస్తాలను వ్యాపారులకు విక్రయించారు.
News December 4, 2025
నేడు గుంటూరు జిల్లాకు లంకా దినకర్ రాక

20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ గురువారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. 4వ తేది ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరోగ్యం, విద్యా రంగాలకు సంబంధించిన ప్రత్యేక పథకాల అమలు పురోగతి, అమృత్ (AMRUT) అమలు స్థితి, జల్ జీవన్ మిషన్ పురోగతి, PM సూర్యాఘర్, కుసుమ్ పథకాలపై సమీక్షి నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం విజయవాడ బయల్దేరి వెళ్తారన్నారు.
News December 3, 2025
NAKSHA కింద రూ.125 కోట్లు మంజూరు: పెమ్మసాని

SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడంలో, 10 పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా APకు కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. మోదీ దూరదృష్టితో, CM చంద్రబాబు నాయుడు, Dy CM పవన్ కళ్యాణ్ నాయకత్వంలో AP పాలనను మరింత బలపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ‘X’ లో ట్వీట్ చేశారు.


