News April 12, 2024
గుంటూరు వైసీపీ MP అభ్యర్థిగా విడదల రజని పోటీ ?

ఎలక్షన్ నోటిఫికేషన్ సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల ఎంపికపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలు పూర్తి చేయగా, కొందరి మార్పు అనివార్యం అని తెలుస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా విడదల రజని పోటీ చేస్తారని తెలుస్తోంది. గుంటూరు పశ్చిమం నుంచి కిలారి రోశయ్యను బరిలో దింపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Similar News
News March 19, 2025
గుంటూరు: వీఆర్‌కు పట్టాభిపురం సీఐ మదుసూదనరావు!

పట్టాభిపురం సీఐ వీరేంద్ర స్థానంలో నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన మదుసూదనరావుకు ఉన్నతాధికారులు ఝలక్ ఇచ్చారు. ఆదివారం రాత్రి ఈయన బాధ్యతలు చేపట్టగా తాజాగా వీఆర్‌కు పంపారు. ఓ ప్రజాప్రతినిధి సిఫార్సుతో ఈయనకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావడంతో వీఆర్‌కు పంపినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. కాగా కేవలం 9 నెలల వ్యవధిలో ఈ స్టేషన్‌కు ముగ్గురు CIలు మారడం గమనార్హం.
News March 19, 2025
గుంటూరు: వడదెబ్బ తగిలి గుర్తుతెలియని వ్యక్తి మృతి

పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళవారం నందివెలుగు రోడ్డు మణిహోటల్ సెంటర్ వద్ద డివైడర్ పై వడదెబ్బ తగిలి ఓ వ్యక్తి మరణించాడు. వార్డు సచివాలయ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకి చేరుకున్నారు. అనంతరం ఆ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. మృతిచెందిన వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లైతే స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
News March 19, 2025
బాలల సంరక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలో బాలల సంరక్షణ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలు చేసి సత్ఫలితాలు సాధించాలని కలెక్టర్ నాగలక్ష్మీ చెప్పారు. ఇందుకు సంబంధిత శాఖలు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు స్థాయిలో బాలల సంక్షేమం, సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి బాల, బాలికల రక్షణ, పునరావాసం, విద్యా , వైద్యం అంశాలపై పరిశీలన చేయాలన్నారు.