News April 28, 2024

గుంటూరు: షెడ్యూల్ విడుదల

image

ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదలైనట్లు ఆ శాఖ జిల్లా సమన్వయకర్త కేఎంఏ హుస్సేన్ శనివారం తెలిపారు. సత్తెనపల్లిలో ఆయన మాట్లాడుతూ.. అపరాధ రుసుము లేకుండా ఈ నెల 29 నుంచి మే 4 వరకు ఆన్‌లైన్‌లో చెల్లించాలని ఆయన సూచించారు. జూన్ 1 నుంచి 8 వరకు పరీక్షలు జరగనున్నాయని తెలిపారు.

Similar News

News January 18, 2025

అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు: కలెక్టర్ 

image

పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని గుంటూరు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ఆదేశించారు. శుక్రవారం, కలెక్టరేట్ నుంచి ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతి నెల 3శనివారం ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని కలెక్టర్ చెప్పారు.

News January 17, 2025

ఎస్ఐపై చర్యలు తీసుకుంటాం: GNT ఎస్పీ

image

పొన్నూరు న్యాయవాది బేతాళ ప్రకాశ్ రావు, ఎస్ఐ రాజ్ కుమార్ మధ్య జరిగిన వాగ్వాదంపై విచారణ జరుగుతోందని, న్యాయవాదులు గుర్తించి తమ శాఖకు సహకరించాలని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. ఘటన జరిగిన రోజు నుంచే రాజ్ కుమార్‌ని వీఆర్‌కు పంపించి డీఎస్పీతో విచారణ చేయిస్తున్నామన్నారు. ఎంక్వైరీ ఆధారంగా ఎస్ఐపై చర్యలు తీసుకుంటామన్నారు.

News January 17, 2025

గుంటూరు: రోడ్డు ప్రమాదంలో మేనేజర్ మృతి

image

గేదెను తప్పించబోయి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నాదెండ్ల మండలంలో గురువారం చోటు చేసుకుంది. SI పుల్లారావు వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన SBI క్రెడిట్ కార్డు మేనేజర్ రాజేశ్, నవీన్ అనే సాటి ఉద్యోగితో బైకుపై నరసరావుపేట వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో సాతులూరు వద్ద గేదెను తప్పించబోయి వెనక వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రాజేశ్‌కు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందగా మరో వ్యక్తి గాయపడ్డాడు.