News October 21, 2024

గుంటూరు: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు

image

ANUలోని సైన్స్ కళాశాలలో ఎమ్మెస్సీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ (వాటర్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల విభాగం సంచాలకులు బ్రహ్మాజీ తెలిపారు. పరిమిత సీట్లు ఉన్నాయని, ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. బీఎస్సీ, బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, రూ.20వేలు ఫీజు చెల్లించి కోర్సులో చేరాలన్నారు.

Similar News

News January 4, 2026

GNT: డిపార్ట్మెంటల్ పరీక్షా కేంద్రాలు ఇవే

image

డిపార్ట్మెంటల్ పరీక్షలు ఈ నెల 5 నుంచి 10 వరకు జరుగుతాయని జిల్లా రెవిన్యూ, పరీక్షల పర్యవేక్షణ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి తెలిపారు. పేరేచర్ల యూనివర్సల్ కాలేజ్, పుల్లడిగుంట మలినేని పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ, కొర్నెపాడు ప్రియదర్శిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 10 నుండి 12 , మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు ఉంటాయన్నారు.

News January 4, 2026

గుంటూరులో రేపు పోలీస్ గ్రివెన్స్ రద్దు: SP

image

అనివార్య కారణాల వల్ల గుంటూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ కార్యక్రమం రద్దైన విషయాన్ని ప్రజలు గమనించి, జిల్లా పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. తదుపరి తేదీని ముందుగా తెలియజేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

News January 4, 2026

GNT: సంక్రాంతి వేళ.. కోడి పందేల మార్కెట్ వేడి

image

సంక్రాంతి పండుగ దగ్గరపడుతుండటంతో కోడి పందేల కోసం కోళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఉమ్మడి గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ప్రత్యేకంగా పెంచిన పందెం కోళ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. సాధారణ కోళ్లు రూ.10,000 నుంచి ప్రారంభమై, జాతి, శిక్షణ, బరువు ఆధారంగా రూ.50,000 వరకు ధర పలుకుతున్నాయి. అక్రమంగా జరుగుతున్న పందేలపై నిఘా పెంచినప్పటికీ, డిమాండ్ మాత్రం తగ్గడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.