News February 28, 2025
గుంటూరు: సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా గుంటూరు- విశాఖపట్నం మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను దక్షిణ మధ్య రైల్వే 2 రోజుల పాటు రద్దు చేసింది. ఈ మేరకు మార్చి 1,2 తేదీలలో గుంటూరు-విశాఖపట్నం(నం.17239), విశాఖపట్నం-గుంటూరు(నం.17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 2,3 తేదీలలో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News March 20, 2025
GNT: బంగారం చోరీ.. పట్టించిన తండ్రి

జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న యువకుడిని అతని తండ్రే పట్టాభిపురం పోలీసులకు అప్పగించాడు. కాకినాడకు చెందిన యువకుడు గుంటూరు విద్యానగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో ఈ నెల 7న రూ. కోటి విలువ చేసే బంగారాన్ని చోరీచేశాడు. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో భయపడి చోరీ బంగారాన్ని పార్సిల్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత తండ్రి ఆ నిందితుణ్ణి స్టేషన్‌లో అప్పగించినట్లు తెలుస్తోంది.
News March 20, 2025
వట్టిచెరుకూరు: అత్యాచార ఘటనలో వృద్దుడి మృతి

ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో బాలిక బంధువుల దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వృద్దుడు మృతి చెందాడు. వట్టిచెరుకూరు సీఐ రామానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిచెరుకూరు మండలంలో 2వ తరగతి చదువుతున్న బాలికపై థామస్ (60)అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలిక బంధువులు థామస్‌పై దాడి చేయడంతో చికిత్స పొందుతూ మరణించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News March 19, 2025
గుంటూరు: వక్కపొడి సంస్థ కార్యాలయాలపై దాడులు

గుంటూరులోని ఓ ప్రముఖ వక్కపొడి సంస్థ కార్యాలయాలపై నిన్నటి నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. బుధవారం కూడా ఐటీ దాడులు కొనసాగాయి. గుంటూరులోని ఆ సంస్థ ఛైర్మన్ నివాసంలోనూ, ఆయన బంధువుల ఇళ్లలోనూ, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. తనిఖీల్లో 40కిలోల బంగారం, 100 కిలోల వెండి, రూ.18లక్షల నగదు సీజ్ చేసినట్టు సమాచారం. వక్కపొడి ఫ్యాక్టరీలోనూ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.