News May 21, 2024
గుంటూరు: సీల్ లేని పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లు.. చర్చనీయాంశం

పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లకు సీల్ వేయకుండా వదిలేసిన వైనం చర్చనీయాంశమైంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లను జీఎంసీలోని అద్దాల గదిలో ఉంచారు. సరైన భద్రత లేని ఆ గది నుంచి బాక్సులను మార్చాలని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇటీవల అధికారులు వాటిని మరో స్ట్రాంగ్ రూంలోకి మార్చారు. వాటికి సీల్ లేకపోవడం గుర్తించి అధికారులకు తెలపడంతో సీల్ వేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు.
Similar News
News October 16, 2025
అమరావతి రైతులకు ముఖ్య సూచన

అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం తుళ్లూరులోని CRDA కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే గ్రీవెన్స్ డేను రైతులు, అమరావతి ప్రాంతవాసులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. భూములిచ్చిన రైతుల సమస్యలను “గ్రీవెన్స్ డే” ద్వారా CRDA అధికారుల దృష్టికి తీసుకురావొచ్చు అని అన్నారు.
News October 16, 2025
గుంటూరు జిల్లాలో 173 న్యూసెన్స్ కేసులు: ఎస్పీ

గుంటూరు జిల్లా వ్యాప్తంగా నైట్ టైమ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నైట్ టైమ్‌లో అనవసరంగా తిరుగుతున్న 181 మందిపై 173 న్యూసెన్స్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఓపెన్ డ్రింకింగ్, రోడ్లపై అనవసరంగా తిరుగుతూ, ప్రజల భద్రతకు భంగం కలిగించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
News October 16, 2025
పెట్టుబడి వ్యయం తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

వ్యవసాయ, ఉద్యాన, పాడి పరిశ్రమ రంగాల్లో పెట్టుబడి వ్యయం తగ్గించి దిగుబడులు ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. గురువారం కలక్టరేట్లో అధికారులతో సమీక్ష చేశారు. సాగు ప్రోత్సాహానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రాయితీల వివరాలను రైతులకు వివరించాలని చెప్పారు. నిర్దేశిత లక్ష్యాల మేరకు అభివృద్ధి సాధించేలా కృషి చేయాలన్నారు.