News February 3, 2025
గుంటూరు: స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపు
గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులూ విజయం సాధించారు. గెలిచిన అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరంటి వర ప్రసాద్(TDP), కొమ్మినేని కోటేశ్వరరావు(TDP), నూకవరపు బాలాజీ(TDP), ముప్పవరపు భారతి(TDP), షేక్ మీరావలి(TDP), దాసరి లక్ష్మి దుర్గ(జనసేన).
Similar News
News February 3, 2025
నాలుగేళ్లలో అమరావతి రైల్వే లైన్ పూర్తి
నాలుగేళ్లలో అమరావతి రైల్వే లైన్ పూర్తి చేస్తామని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ. పాటిల్ తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతికి రైల్వే లైన్‌ను గతేడాది అక్టోబర్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదించినట్టు గుర్తు చేశారు. ఇప్పటికే నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై సహా పలు ప్రాంతాలతో లైన్ కలుపనుంది.
News February 3, 2025
GNT: SI అంటూ బెదిరించి రూ.24లక్షలు స్వాహా
ఎస్ఐ అంటూ బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.24 లక్షలు దోచేసిన వైనంపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. నెహ్రు నగర్‌కి చెందిన నాగేశ్వరరావుకు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎస్ఐ ప్రసాద్‌ను అని చెప్పాడు. బెంగళూరులో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశామన్నాడు. ఆ కేసుతో సంబంధాలు ఉన్నాయని నాగేశ్వరావుని బెదిరించి విడతల వారీగా రూ.24లక్షలు నకిలీ ఎస్ఐ ఖాతాలోకి జమ చేయించుకున్నాడు.
News February 3, 2025
గుంటూరు: రైల్వేలో ఉద్యోగం.. ఈరోజే లాస్ట్
SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 3, 2025.