News February 3, 2025
గుంటూరు: స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపు

గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులూ విజయం సాధించారు. గెలిచిన అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరంటి వర ప్రసాద్(TDP), కొమ్మినేని కోటేశ్వరరావు(TDP), నూకవరపు బాలాజీ(TDP), ముప్పవరపు భారతి(TDP), షేక్ మీరావలి(TDP), దాసరి లక్ష్మి దుర్గ(జనసేన).
Similar News
News February 9, 2025
నులిపురుగులపై అవగాహన కల్పించాలి: DEO

ఈనెల 10వ తేదీన జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేయాలని గుంటూరు డీఈవో సీవీ. రేణుక ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. నులి పురుగులపై అసెంబ్లీలో అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు విద్యార్థులతో వేయించాలన్నారు. హాజరు కాని విద్యార్థులకు 17వ తేదీన ఇవ్వాలన్నారు.
News February 9, 2025
ప్రయాగరాజ్‌కు మరో స్పెషల్ బస్ ఏర్పాటు

ఆర్టీసీ గుంటూరు-2 డిపో నుంచి మహాకుంభమేళా (ప్రయాగరాజ్)కు మరో స్పెషల్ బస్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ షేక్. అబ్దుల్ సలాం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈనెల 11న ఏర్పాటు చేసిన బస్సు నిండిపోవడంతో 15వ తేదీన మరో పుష్ బ్యాక్ సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ యాత్ర మొత్తం 8 రోజులు ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 15న ఉదయం 10గంటలకు గుంటూరులో బస్సు బయలుదేరుతుందన్నారు.
News February 9, 2025
ఆ ఫోన్ నంబర్లు వస్తే ఫోన్ ఎత్తకండి: సీఐ రమేశ్ బాబు

ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90, #09ను డయల్ చేయమంటే చేయొద్దని, అలా చేస్తే మీ సిమ్‌ని వారు యాక్టివేట్ చేసుకుని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని త్రీ టౌన్ సీఐ రమేశ్ బాబు తెలిపారు. అట్లాగే +3, +5, +9, +2 సిరీస్‌తో వచ్చే ఫోన్ నంబర్లను అస్సలు లిఫ్ట్ చేయవద్దని సూచించారు. మిస్డ్ కాల్ వచ్చిందని ఆ నంబర్లకు ఫోన్ చేస్తే మూడు సెకన్లలో ఫోన్‌లో ఉన్న డేటాను హ్యాక్ చేస్తారని తెలిపారు.