News February 28, 2025

గుంటూరు: స్ట్రాంగ్ రూమ్‌ని పరిశీలించిన కలెక్టర్ 

image

కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల బ్యాలెట్ బాక్సులను గుంటూరు ఏసీ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. పోలింగ్ పక్రియ ముగిసిన తర్వాత అన్నీ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను ఏసీ కళాశాలకు తీసుకొచ్చారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ స్ట్రాంగ్ రూమ్ రూమ్‌లో బ్యాలెట్ బాక్సులను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Similar News

News March 26, 2025

తాడేపల్లి: పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై సీఎం చంద్రబాబు విచారం

image

హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడారు. చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు రాత్రి ద్విచక్ర వాహనంపై రాజమండ్రి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

News March 26, 2025

రేపు పోలవరం ప్రాజెక్ట్ పరిశీలించనున్న చంద్రబాబు

image

రేపు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ఈ మేరకు బుధవారం సీఎమ్ఓ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పర్యటనలో భాగంగా సీఎం పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హిల్ వ్యూకు సీఎం చేరుకోనున్నారు. డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్‌ పనులపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. 

News March 26, 2025

GNT: రూ.15కోట్లతో విద్యుత్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్‌ల ఏర్పాటు 

image

గుంటూరు-1, మంగళగిరి ఆర్టీసీ డిపోల్లో రూ.15కోట్లతో విద్యుత్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కాబోతున్నాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గుంటూరుకు 150 బస్సులు మంజూరైన సంగతి తెలిసిందే. 100 బస్సులు గుంటూరు డిపోకి, మిగిలిన 50 బస్సులు మంగళగిరి డిపోకు కేటాయించనున్నారు. బస్సులు ఛార్జింగ్ పెట్టేందుకు బుడంపాడు నుంచి 3kv విద్యుత్ లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ బస్సులు 40కి.మీ. ప్రయాణిస్తాయి. 

error: Content is protected !!